Auto text - Schedule Messages App Review

 Auto text - Schedule Messages App Review:


మనలో చాలా మంది పుట్టినరోజు శుభాంక్షలు, ప్రతి రోజు ఆఫీస్ టాస్క్ లను మరియు కస్టమర్లకు పంపాల్సిన మెసేజ్ లను మరచిపోతుంటారు. అలాంటి సందర్భాలలో ఈ Auto text - Schedule Message యాప్ చాలా ఉపయోగపడుతుంది. 

ఈ యాప్ ద్వారా మీరు ముందుగానే మెసేజ్ టైపు చేసి, మీకు కావాల్సిన తేదీ మరియు సమయానికి ఆటోమేటిక్ గా పంపేలా షెడ్యూల్ చేయవచ్చు. 

ముఖ్యమైన ఫీచర్లు:

1. SMS Schedule:

మీరు ఈరోజు మెసేజ్ టైపు చేసి రేపు లేదా వచ్చే నెల ఏ తేదీ, ఏ సమయంలో పంపాలో డిసైడ్ చేయవచ్చు.

2. Whatsapp Message Scheduling:

ఇందులో వాట్సాప్ మెసేజీలను ముందుగానే షెడ్యూల్ చేయవచ్చు.  పుట్టిన రోజులు, పండుగ శుభాకాంక్షలు మరియు ఆఫీస్ రిమాండర్ల కోసం ఉపయోగించవచ్చు.

3. Recurring Messages:

దీని ద్వారా ప్రతి రోజు, ప్రతి నెల, ప్రతి వారం ఒకే మెసేజ్ ని ఆటోమేటిక్ గా పంపేలా చేయవచ్చు.

4. Auto Reply:

మీరు ఏదైనా ముఖ్యమైన పనిలో నిమగ్నమై ఉన్నపుడు లేదా అందుబాటులో లేనప్పుడు ఆటోమేటిక్ రిప్లయ్ లను సెట్ చేసికొని పంపే అద్భుతమైన ఫీచర్ ఇది.

5. Bulk Messaging:

ఒక మెసేజ్ ని ఒకేసారి చాలామందికి పంపడానికి మరియు ఇది చిన్న వ్యాపారాలలో, మార్కెటింగ్ మరియు కస్టమర్లకు నోటిఫికేషన్ల లేదా రిమాండర్ల లాగా ఉపయోగపడుతుంది.

6. SMS Forwarding:

మీకు వచ్చే మెసేజ్ లను మరొక మొబైల్ నెంబర్ కి  ఫార్వర్డ్ చేసే ఫీచర్ కూడా ఉంది.

ఈ యాప్ ఎవరెవరికి ఉపయోగపడుతుంది అంటే చిన్న వ్యాపార యజమానులకు, షాప్ ఓనర్లకి, ఫ్రీలాన్సర్లకి, స్టూడెంట్స్ కి, ఉద్యోగులకి, యూటుబ్ర్స్ మరియు బ్లాగర్లకి, స్పెషల్ డేస్ మరచిపోకుండా ఆటోమేటిక్గా  విషెస్ పంపుకునే వారికి.

Advantages(ప్రయోజనాలు):

SMS మరియు Whatsapp Scheduling, రికర్రింగ్ మెసేజెస్, ఆటో రిప్లయ్, బల్క్ మేసెగింగ్, ఈజీ యూసర్ ఇంటర్ఫేస్, ఫ్రీ ప్లాన్ యాడ్స్ తో మరియు పెయిడ్ సుబ్స్క్రిప్షన్ ప్లాన్స్ అది మీరు వినియోగించే దాన్ని బట్టి తీసుకోవచ్చు.

ఈ యాప్ వినియోగానికి మరియు ఈజీ యూసర్ ఇంటర్పేస్ కి  4.5/5 రేటింగ్ ఇవ్వచ్చు.
 
మరియు ఈ యాప్ ని గూగుల్ ప్లే స్టోర్ నుండి ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Popular posts from this blog

ఇంట్లో Sweet Paan తయారీ | Premium Meetha Paan Recipe in Telugu

OKEN – CamScanner & PDF Scanner